YS Viveka Murder Case: వివేకా కూతురుపై తప్పుడు ఫిర్యాదు చేశారంటూ కృష్ణారెడ్డికి పులివెందుల డీఎస్పీ నోటీసులు

Pulivendula DSP notices to Krishna Reddy

  • వివేకా హత్య కేసులో వైసీపీ నాయకుల పేర్లు చెప్పాలని బెదిరించినట్లు కృష్ణారెడ్డి ఫిర్యాదు
  • సీబీఐ ఎస్పీ రాంసింగ్ కొట్టారని, సునీత బెదిరించారని ఫిర్యాదు
  • కృష్ణారెడ్డి ఆ రోజు తప్పుడు ఫిర్యాదు చేసినట్లుగా నిర్ధారించిన పోలీసులు

దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డికి డిఎస్పీ నోటీసులు జారీ చేశారు. వివేకా హత్య కేసులో వైసీపీ నాయకుల పేర్లు చెప్పాలని సీబీఐ ఎస్పీ రాంసింగ్ కొట్టారని, ఆయన చెప్పినట్లు వినాలని వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి తమను బెదిరించారని కృష్ణారెడ్డి 2022లో పులివెందుల కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో వారి ముగ్గురిపై కేసు నమోదయింది.

దీనిపై విచారణ చేపట్టిన పులివెందుల పోలీసులు కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు చేసినట్లు నిర్ధారించారు. వివేకా హత్య కేసులో సీబీఐ ఎస్పీ, సునీత, రాజశేఖర్ రెడ్డి బెదిరించారనే ఫిర్యాదులో వాస్తవం లేదని తేల్చారు. ఈ మేరకు పులివెందుల కోర్టులో డీఎస్పీ మురళీ నాయక్ తుది నివేదికను సమర్పించారు. పోలీసులు సమర్పించిన ఈ నివేదికను మెజిస్ట్రేట్ పరిశీలించనున్నారు. 

మరోవైపు, కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశాడని విచారణలో తేలడంతో ఆయనకు డీఎస్పీ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో 23 మంది సాక్షులను విచారించినట్లు డీఎస్పీ కోర్టుకు తెలియజేశారు.

  • Loading...

More Telugu News