Jagan: పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించిన జగన్

- ఇటీవల కన్నుమూసిన పాలవలస రాజశేఖరం
- పాలకొండకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్
- ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన రాజశేఖరం
వైసీపీ అధినేత జగన్ ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు వెళ్లారు. పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించారు. నియోజకవర్గంలో సీనియర్ నేత అయిన రాజశేఖరం 81 ఏళ్ల వయసులో ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు.
రాజశేఖరం మృతి వార్త తెలిసిన వెంటనే ఆయన మరణం పట్ల జగన్ సంతాపాన్ని ప్రకటించారు. ఫోన్ ద్వారా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఇప్పుడు నేరుగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజశేఖరం ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రాజశేఖరం కుమారుడే. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి రాజశేఖరం కుమార్తె.