Bangladesh: 228 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్, ఐదు వికెట్లతో షమీ రికార్డ్!

Bangladesh set India 229 run target

  • విఫలమైన టాపార్డర్
  • సెంచరీతో ఆకట్టుకున్న మిడిలార్డర్ ఆటగాడు తౌహిద్
  • ఐదు వికెట్లతో అదరగొట్టిన మహమ్మద్ షమి

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత్ 228 పరుగులకే కట్టడి చేసింది. బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు టాపార్డర్ విఫలమైనప్పటికీ, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ తౌహిద్ హృదయ్ సెంచరీ (100)తో రాణించాడు. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతూ సెంచరీ చేసిన తొమ్మిదో బ్యాటర్‌గా నిలిచాడు. జాకెర్ అలీ కూడా అర్ధ సెంచరీ (68)తో ఆకట్టుకున్నాడు.

భారత బౌలర్లలో మహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. హర్షిత్ రాణా మూడు వికెట్లు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో షమీ వన్డేల్లో 200 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.

అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ మిస్ అయింది. తొమ్మిదో ఓవర్‌లో వరుస బంతుల్లో తంజిద్, ముష్ఫికర్లను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. ఆ తర్వాత బంతికి కూడా వికెట్ మిస్ కావడంతో హ్యాట్రిక్ కోల్పోయాడు. రోహిత్ శర్మ చేతిలో పడిన క్యాచ్‌ను జారవిడవడంతో, అతనికి క్యాచ్‌ను వదిలేసినందుకు అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెబుతున్నట్లుగా సైగ చేశాడు. అనంతరం భారత్ 229 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగింది.

Bangladesh
India
Cricket
Team India
  • Loading...

More Telugu News