Padi Kaushik Reddy: ఎన్నికల ప్రచారంలో ఆత్మహత్య చేసుకుంటానని కౌశిక్ రెడ్డి బెదిరించిన కేసు.. విచారణ వాయిదా

- అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెదిరించారంటూ నోడల్ అధికారి ఫిర్యాదు
- పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కమలాపూర్ పోలీసులు
- కేసు కొట్టి వేయాలంటూ కౌశిక్ రెడ్డి పిటిషన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుజూరాబాద్‌లో ప్రచారం సందర్భంగా ఆత్మహత్య చేసుకుంటానని కౌశిక్ రెడ్డి బెదిరించాడని కేసు నమోదైంది. కమలాపూర్ నోడల్ అధికారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రచారంలో ఆత్మహత్య చేసుకుంటానని కౌశిక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నోడల్ అధికారి ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ప్రస్తుతం ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో కేసు విచారణలో ఉంది. ఈ కేసును కొట్టి వేయాలంటూ కౌశిక్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు, తదుపరి విచారణను వాయిదా వేసింది.
బండి సంజయ్‌పై నమోదైన కేసును కొట్టివేసిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై నమోదైన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మర్రిగూడ పోలీస్ స్టేషన్‌లో బండి సంజయ్‍పై కేసు నమోదైంది. బీఆర్ఎస్‌ను దండుపాళ్యం బ్యాచ్‌తో పోల్చారంటూ ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు కేసును కొట్టివేసింది.