Narendra Modi: చంద్రబాబు, పవన్ లతో ప్రత్యేకంగా సమావేశమైన మోదీ

Modi meeting with Chandrababu and Pawan Kalyan

  • ఎన్డీయే పక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం
  • సమావేశానికి హాజరైన మోదీ, అమిత్ షా
  • ఏపీకి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందన్న మోదీ

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత ఎన్డీయే పక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మోదీ, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  

ఏపీలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయని మోదీ అడిగారు. అమరావతి పనుల స్థితిగతులను కూడా అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మోదీ భరోసా ఇచ్చారు. దీనికి చంద్రబాబు, పవన్ ధన్యవాదాలు తెలియజేశారు. 

ఎన్డీయే సమావేశం పూర్తైన తర్వాత జాతీయ మీడియాతో పవన్ మాట్లాడుతూ... ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే గత ఎన్డీయే సమావేశాలకు తాను హాజరుకాలేకపోయానని చెప్పారు. ఇప్పటికీ తాను వెన్నునొప్పితో బాధపడుతున్నానని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని... అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News