HYDRA: హైడ్రా విధుల్లో డీఆర్ఎఫ్ పాత్ర చాలా కీలకం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

HYDRA Commissioner Ranganath on DRF

  • ఔట్ సోర్సింగ్ విధానంలో 357 మందిని తీసుకున్న హైడ్రా
  • అంబర్‌పేట పోలీసు శిక్షణ మైదానంలో వారం రోజుల పాటు శిక్షణ
  • ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు స్పందించాలన్న రంగనాథ్

హైదరాబాద్ నగరంలో హైడ్రా నిర్వహిస్తున్న విధుల్లో డీఆర్ఎఫ్ బృందాల పాత్ర కీలకమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. డీఆర్ఎఫ్‌లోకి అవుట్ సోర్సింగ్ విధానంలో కొత్తగా నియమితులైన 357 మంది సిబ్బంది శిక్షణ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అంచనాలకు అనుగుణంగా హైడ్రా పనిచేస్తోందని ఆయన తెలిపారు.

డీఆర్ఎఫ్‌లోకి అవుట్ సోర్సింగ్ విధానంలో నియమితులైన సిబ్బందికి హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసు శిక్షణ మైదానంలో వారం రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలతో పాటు ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో డీఆర్ఎఫ్ పాత్ర ఎంతో ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హైడ్రా విధులు కూడా అదనంగా చేరాయని తెలిపారు. హైడ్రాపై ఉన్న నమ్మకంతో ప్రభుత్వం పలు బాధ్యతలు అప్పగిస్తోందని, వాటిని సక్రమంగా నెరవేర్చాలని ఆయన సూచించారు.

ఇటీవల ఇసుక అక్రమ రవాణాను నియంత్రించే బాధ్యతను కూడా హైడ్రాకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ బాధ్యతలను సిబ్బంది ఎంతో శ్రద్ధగా, బాధ్యతతో నిర్వర్తించాలని ఆయన అన్నారు. పోలీసు పరీక్షలో కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం పొందలేని వారిని అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News