Stock Market: వరుసగా మూడోరోజు నష్టపోయిన మార్కెట్లు

markets ends in losses

  • 203 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 19 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా నష్టపోయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూలతలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ఒరవడిని కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 203 పాయింట్లు నష్టపోయి 75,935కి పడిపోయింది. నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయి 22,913 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 86.65గా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.32%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.01%), అదానీ పోర్ట్స్ (2.85%), టాటా స్టీల్ (1.58%), టాటా మోటార్స్ (1.33%).

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.35%), మారుతి (-1.81%), టెక్ మహీంద్రా (-1.69%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.33%), ఐటీసీ (-1.06%). 

  • Loading...

More Telugu News