Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లపై ముగిసిన వాదనలు

- రెండు రోజులుగా పిటిషన్లను విచారించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు
- రేపు తీర్పును వెలువరిస్తామన్న న్యాయమూర్తి
- వంశీని ప్రత్యేక సెల్ లో ఎందుకు ఉంచారన్న జడ్జి
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి, ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లను ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈరోజు విచారించింది. గత రెండు రోజులుగా ఈ పిటిషన్లపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈరోజు వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రేపు వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. జైల్లో బెడ్ సమకూర్చడం, ఇంటి నుంచి ఆహారం తెప్పించుకోవడానికి సంబంధించి రేపు కోర్టు తీర్పును వెలువరించనుంది.
వాదనల సందర్భంగా వంశీని ప్రత్యేక సెల్ లో ఎందుకు ఉంచారని న్యాయమూర్తి ప్రశ్నించారు. జైల్లో బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఉన్నారని... మాజీ ఎమ్మెల్యే అయిన వంశీ భద్రత రీత్యా ఆయనను ప్రత్యేక సెల్ లో ఉంచామని జైలు సూపరింటెండెంట్ పాల్ కోర్టుకు తెలిపారు. మరోవైపు వంశీ బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈరోజు కొట్టివేసింది.