DSP: రాజలింగమూర్తి హత్యపై డీఎస్పీ సంపత్ రావు ఏమన్నారంటే?

DSP on Rajalingamurthy murder case

  • రాజలింగమూర్తి హత్య కేసులో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్న డీఎస్పీ
  • మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వెల్లడి
  • ఈ హత్యపై అన్ని కోణాల్లో దర్యాఫ్తు జరుపుతున్నామన్న సంపత్ రావు

రాజలింగమూర్తి హత్య కేసులో ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ సంపత్ రావు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని గతంలో కేసు వేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు.

నిన్న తన స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి రాజలింగమూర్తి వెళ్లారు. ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి తిరిగి వస్తుండగా తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం కార్యాలయం ఎదురుగా నలుగురు నుండి ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి ఆయనను చుట్టుముట్టి, కత్తులు, గొడ్డళ్లతో నరికారు.

రాజలింగమూర్తి హత్యపై డిఎస్పీ మాట్లాడుతూ, ఈ హత్యపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ కస్టడీలోకి తీసుకోలేదని ఆయన అన్నారు. హత్య వెనుక ఉన్న ఎవరినీ వదిలి పెట్టేది లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. రాజలింగమూర్తితో హంతకులకు భూతగాదాలు ఉన్నాయని, హత్యకు ఇతర కారణాల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News