Champions Trophy 2025: ఛాంపియ‌న్స్ ట్రోఫీ.. భార‌త్ పై టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌

 Bangladesh have Won the Toss and they Will Bat Against India

  • దుబాయ్ వేదిక‌గా భార‌త్‌, బంగ్లా మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌
  • ముగ్గురు ఆల్‌రౌండ‌ర్ల‌తో బ‌రిలోకి దిగుతున్న‌ టీమిండియా
  • అర్ష్‌దీప్, వ‌రుణ్ ఔట్‌.. హ‌ర్షిత్ రాణా, కుల్దీప్ యాద‌వ్ ఇన్‌

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో మ్యాచ్ లో భార‌త్‌, బంగ్లాదేశ్ త‌ల‌ప‌డుతున్నాయి. మొద‌ట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఈ మ్యాచ్ లో ముగ్గురు ఆల్‌రౌండ‌ర్ల‌ను ఆడిస్తోంది. హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్‌, ర‌వీంద్ర జ‌డేజాల‌తో బ‌రిలోకి దిగింది. 

అటు బౌలింగ్ విభాగంలో మ‌హ్మ‌ద్ ష‌మీతో పాటు హ‌ర్షిత్ రాణాను తీసుకుంది. స్పెష‌లిస్ట్ స్పిన్న‌ర్‌గా కుల్దీప్ యాద‌వ్ ను ఎంపిక చేసుకుంది. దాంతో అర్ష్‌దీప్ సింగ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అలాగే వికెట్ కీప‌ర్ గా రిష‌భ్ పంత్ ను ప‌క్క‌న పెట్టి కేఎల్ రాహుల్ ను తీసుకుంది. 

కాగా, టాస్ ఓడిన కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... తాము మొద‌ట బౌలింగ్ చేయ‌డం మంచికేన‌ని అన్నారు. ఎందుకంటే ఈ మైదానంలో ఫ్ల‌డ్‌లైట్ల కింద బ్యాటింగ్ చేయ‌డం బాగుంటుంద‌ని చెప్పుకొచ్చారు. 

భారత జ‌ట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ.

బంగ్లా జ‌ట్టు: తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీప‌ర్‌), జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మ‌ద్‌, ముస్తాఫిజుర్ రెహమాన్.

  • Loading...

More Telugu News