Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్ర‌మాణం

Delhi CM Rekha Gupta Oath Taking

  • ఆమె చేత ప్ర‌మాణం చేయించిన లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా
  • మంత్రులుగా ప‌ర్వేశ్ శ‌ర్మ‌, సాహిబ్ సింగ్‌, అశీశ్ సూద్‌, మంజీంద‌ర్ సింగ్ త‌దిత‌రులు ప్ర‌మాణం
  • ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ ప్ర‌ధాని మోదీ, ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌

ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా రేఖా గుప్తా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఆమె చేత లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా ప్ర‌మాణం చేయించారు. అలాగే మంత్రులుగా ప‌ర్వేశ్ శ‌ర్మ‌, సాహిబ్ సింగ్‌, అశీశ్ సూద్‌, మంజీంద‌ర్ సింగ్‌, ర‌వీంద‌ర్ ఇంద్ర‌జ్ సింగ్, క‌పిల్ మిశ్రా, పంక‌జ్ కుమార్ సింగ్ ప్ర‌మాణం చేశారు. 

ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా,  ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హాజ‌ర‌య్యారు. 


Rekha Gupta
Delhi CM
Oath Taking
BJP
  • Loading...

More Telugu News