Nalini: ఇప్పటి అమ్మాయిలు చాలా తెలివైనవాళ్లు: సీనియర్ హీరోయిన్ నళిని

Nalini Interview

  • 1980లలో హీరోయిన్ గా మెరిసిన నళిని 
  • 'ప్రేమసాగరం'తో వచ్చిన స్టార్ డమ్
  • పెళ్లి విషయంలో తొందరపడ్డామని వెల్లడి 
  • పెద్దగా చదువుకోకపోవడమే అందుకు కారణమని వివరణ 
  • పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడమే బెటర్ అంటూ వ్యాఖ్య  
 
1980లలో కథానాయికగా 'నళిని' తన జోరు చూపించారు. తెలుగు .. తమిళ .. కన్నడ సినిమాలలో క్రేజ్ సంపాదించుకున్నారు. అప్పట్లో ఆమె చేసిన 'ప్రేమసాగరం' ఇప్పటికీ ఓ మ్యూజికల్ హిట్ అనే చెప్పాలి. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నళిని మాట్లాడుతూ తన గురించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. 

"నేను సెవెంత్ క్లాస్ లో ఉండగా 'ప్రేమసాగరం' సినిమా చేశాను. ఆ సినిమా హిట్ తో విపరీతమైన క్రేజ్ వచ్చింది. నన్ను చూడటానికి మా స్కూల్ కి బాయ్స్ ఎక్కువగా వస్తుండటంతో, టీసీ ఇచ్చి పంపించారు. ఆ తరువాత నా చదువు సాగలేదు. నా అసలు పేరు 'రాణి' .. సినిమాల్లోకి వచ్చిన తరువాత 'నళిని'గా మార్చారు. తెలుగులో నా మొదటి సినిమా 'తోడు నీడ'. ఆ తరువాత చేసిన 'సంఘర్షణ' నుంచి మరింత పాప్యులర్ అయ్యాను" అని అన్నారు.

"కెరియర్ తొలినాళ్లలోనే షూటింగు స్పాట్ నుంచి పారిపోయి, ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్నాను. మా ఫ్యామిలీకి భయపడి ఎంతోమంది ఇళ్లలో దాక్కున్నాం. ఆ సమయంలోనే చెన్నై కి వెళ్లకుండా మలయాళ .. కన్నడ సినిమాలు చేశాను. నా కోసం ఆయన మా వాళ్లతో తన్నులు తిన్నారు .. ఆయన కోసం నేను త్యాగాలు చేశాను. అయితే వివాహమైన ఐదేళ్ల తరువాత పరిస్థితులు మారాయి. ఇద్దరం ఒక అవగాహనకి వచ్చిన తరువాతనే విడిపోయాము"అని చెప్పారు. 

"నేను పెద్దగా చదువుకోలేదు గనుక నా పిల్లలను బాగా చదివించి వృధ్ధిలోకి తీసుకొచ్చాను. మా ఆయనకి చదువుకోవడం అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఆయన లేకపోవడం వల్లనే నా పిల్లలు వృద్ధిలోకి వచ్చారని నేను భావిస్తూ ఉంటాను. ఈ కాలం ఆడపిల్లలు చాలా తెలివైన వాళ్లు .. వాళ్లకి అన్నీ తెలుసు. అయినా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలి .. ఒకవేళ ప్రేమిస్తే కూడా పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకోవాలని అనుభవంతో నేను చెబుతూ ఉంటాను. ఆ రోజున నేను అలా తొందరపడటానికి కారణం కూడా, పెద్దగా చదువుకోకపోవడమే అని నమ్ముతుంటాను" అని అన్నారు.        

  • Loading...

More Telugu News