Jagan: జగన్ పై నల్లపాడు పీఎస్ లో కేసు నమోదు

Police case filed in Jagan

  • గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటన
  • ఎమ్మెల్సీ కోడ్ ఉన్నా పర్యటనకు వచ్చారంటూ కేసు
  • మరికొందరు వైసీపీ నేతలపైనా కేసు నమోదు చేసిన పోలీసులు 

వైసీపీ అధినేత జగన్ ఇవాళ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించడంపై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, పర్యటనకు రావొద్దని ఈసీ, జిల్లా కలెక్టర్ చెప్పినప్పటికీ... జగన్ మిర్చి యార్డు పర్యటనకు వచ్చారు. 

ఈ నేపథ్యంలో, ఆయనపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈసీ, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు బేఖాతరు చేస్తూ మిర్చి యార్డులో కార్యక్రమం నిర్వహించారంటూ... జగన్, అంబటి రాంబాబు, కొడాలి నాని, లేళ్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేశ్ తదితరులపై కేసు నమోదు చేశారు.

Jagan
Police Case
Guntur Mirchi Yard
YSRCP
  • Loading...

More Telugu News