Allu Arjun: అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం

Allu Arjun on The Hollywood Reporter India magazine cover page

  • భారత్ లో అడుగుపెడుతున్న ది హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్
  • ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా తొలి సంచికపై అల్లు అర్జున్ ముఖచిత్రం
  • స్టార్ ఆఫ్ ఇండియా అల్లు అర్జున్ అంటూ కథనం

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా వార్తల మ్యాగజైన్ 'ది హాలీవుడ్ రిపోర్టర్' ఇప్పుడు ది 'హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' పేరిట భారత్ లోనూ అలరించనుంది. భారత్ లో ఈ మ్యాగజైన్ తొలి సంచికను అల్లు అర్జున్ ముఖచిత్రంతో తీసుకువస్తుండడం విశేషం. 

అల్లు అర్జున్: ది రూల్ పేరిట కవర్ పేజీ కథనం కూడా రూపొందించారు. అల్లు అర్జున్ హీరోగా తెలుగులో తీసిన పుష్ప-2 చిత్రం హిందీ సినిమా చరిత్రను తిరగరాసిందని ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేర్కొంది. అల్లు అర్జున్ ను స్టార్ ఆఫ్ ఇండియా అని అభివర్ణించింది.

కాగా, అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప-2: ది రూల్ చిత్రం వరల్డ్ వైడ్ రూ.1,871 కోట్లు వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు చేసింది.

More Telugu News