Chandrababu: ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు

- రేపు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం
- హాజరు కానున్న చంద్రబాబు
- ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఆయన కొద్దిసేపటి కిందట ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు.
కాగా, ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాసేపట్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను బీజేపీ నేతలు కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించాలని కోరనున్నారు.