Nara Lokesh: మీరు వచ్చాక టెన్షన్ లేకుండా చదువు కొనసాగిస్తున్నాం!: నారా లోకేశ్ తో పద్మావతి వర్సిటీ విద్యార్థినులు

Padmavathi University students thanked Nara Lokesh

  • పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన నారా లోకేశ్
  • ఇండోర్ స్టేడియానికి ప్రారంభోత్సవం
  • పద్మావతి ఇంజినీరింగ్ కాలేజి సందర్శన 

గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు వస్తాయో, రావోనన్న ఆందోళనతో చదువుపై దృష్టి పెట్టలేని పరిస్థితులు ఉండేవి, మీరు అధికారంలోకి వచ్చాక బకాయిలు లేకుండా రీఎంబర్స్ మెంట్ సొమ్ము జమ చేస్తుండటంతో టెన్షన్ లేకుండా చదువుకోగలుగుతున్నామని పద్మావతి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు మంత్రి నారా లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

పద్మావతి యూనివర్సిటీలో అధునాతన ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన అనంతరం పద్మావత ఇంజినీరింగ్ కాలేజి ట్రిపుల్ ఈ 3వ సంవత్సరం విద్యార్థినుల తరగతి గదిని సందర్శించిన లోకేశ్...వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా చంద్రగిరికి చెందిన మేఘన మాట్లాడుతూ... "మీ తాతగారు ఎన్టీఆర్ హయాంలో తిరుపతిలో మహిళా వర్సిటీ ఏర్పాటు చేశారు, రాష్ట్ర విద్యా మంత్రిగా మా సమస్యలపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది, గతంలో రీఎంబర్స్ మెంట్ సొమ్ము ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో, రాదోనన్న ఆందోళనకు గురయ్యేవాళ్లం, మీ ప్రభుత్వం వచ్చిక మొదటి సెమిస్టర్ కు సంబంధించిన సొమ్ము బకాయి పెట్టకుండా విడుదల చేయడం ఆనందంగా ఉంది, గత ప్రభుత్వ హయాంలోని బకాయిలను కూడా విడుదల చేయాలి" అని కోరారు. 

మంత్రి లోకేశ్ స్పందిస్తూ... "ఇకపై ఫీజు రీఎంబర్స్ మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా విడుదల చేస్తాం, గత ప్రభుత్వం సుమారు రూ.4 వేల కోట్ల రూపాయల రీఎంబర్స్ మెంట్ బకాయిలు పెట్టి వెళ్లింది. రాష్ట్రం ఆర్థికంగా కుదుటపడ్డాక విడదల వారీగా గత బకాయిలను కూడా చెల్లిస్తాం" అని వెల్లడించారు.

టెక్నాలజీలో ర్యాపిడ్ గా మార్పులు వస్తున్నాయని, అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా విద్యార్థినులకు శిక్షణ ఇవ్వాల్సి ఉందని లోకేశ్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఉన్నత విద్యావిభాగాన్ని బలోపేతం చేస్తున్నామని, ఇటీవలే విద్యాధికుడైన చైర్మన్ ను నియమించామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ విద్యార్థులు రాణించేలా యూనివర్సిటీ విద్యావిధానంలో సమూల మార్పులు తెస్తామని తెలిపారు.

ప్రభుత్వ విద్యతో పాటు ప్రైవేటు ఇంజనీరింగ్ విద్యను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసి, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తామని లోకేష్ చెప్పారు. మౌనిక అనే విద్యార్థిని మాట్లాడుతూ... విద్యతోపాటు స్పోర్ట్స్ కు కూడా ప్రోత్సాహం కల్పించాలని కోరారు.

  • Loading...

More Telugu News