Nara Lokesh: టీటీడీ సేవలను సరళీకృతం చేస్తాం: నారా లోకేశ్

Nara Lokesh on TTD services

  • శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు
  • దర్శనానికి భక్తులు బారులు తీరకుండా చర్యలు తీసుకుంటామన్న లోకేశ్
  • టీటీడీ సేవలు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయని వ్యాఖ్య

తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతి రోజు 60 వేలకు పైగా భక్తులు వస్తున్న సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో దర్శనానికి సంబంధించి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. క్యూ కాంప్లెక్స్ లలో గంటల తరబడి భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. 

ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. టికెట్ బుకింగ్, ఆలయ సర్వీసులను సరళీకృతం చేస్తామని తెలిపారు. టీటీడీ ఆన్ లైన్ సేవలు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయని... భక్తులను ఆలయాలకు మరింత చేరువ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుపతిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో రెండో రోజు కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News