TTD Employees: నరేశ్ కుమార్ పై చంద్రబాబు, పవన్ చర్యలు తీసుకోవాలి: టీటీడీ ఉద్యోగులు

- టీటీడీ ఉద్యోగిని తీవ్రంగా దూషించిన బోర్డు సభ్యుడు నరేశ్ కుమార్
- నరేశ్ కుమార్ రాజీనామా చేయాలంటున్న టీటీడీ ఉద్యోగులు
- రేపు తిరుపతిలో టీటీడీ ఉద్యోగుల నిరసన
టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్ కుమార్ పై దేవస్థానం ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తాను బయటికి వస్తుంటే ఓ ఉద్యోగి గేటు తీయకుండా అడ్డుకున్నాడంటూ టీటీడీ సభ్యుడు నరేశ్ కుమార్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడడం తెలిసిందే.
నరేశ్ కుమార్ వైఖరి పట్ల ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్ద నిరసన చేపడతామని ప్రకటించారు. రేపు ఉదయం 9.30 గంటల నుంచి 10.30 వరకు నిరసన చేపడతామని టీటీడీ ఉద్యోగులు వెల్లడించారు.
టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేశ్ కుమార్ రాజీనామా చేయడాలని స్పష్టం చేశారు. అతడు రాజీనామా చేయకపోతే... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు స్పష్టం చేశారు.
టీటీడీలో ఎంతటి ప్రముఖులనైనా శ్రీవారి ఆలయంలో బయోమెట్రిక్ మార్గం నుంచే బయటికి పంపాలని ఆదేశాలు ఉన్నాయని, అందుకే సదరు ఉద్యోగి గేటు తీయలేదని దేవస్థాన ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఆదేశాల ప్రకారం నడుచుకున్న ఆ ఉద్యోగిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.