Kerala Twins: అచ్చం ఒకేలా ఉండే కవల అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారో చూడండి!

Twin sisters married identical twin boys in Kerala

 


కొందరు కవలల్లో అస్సలు తేడా గుర్తించలేం. అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉంటారు. కేరళకు చెందిన ఈ కవల సోదరీమణులు కూడా అలాంటివాళ్లే. వీళ్లను చూస్తే బాగా పరిచయం ఉన్న వాళ్లు కూడా పోల్చుకోవడం కష్టమే. 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ కవలలు పెళ్లి చేసుకున్నారు. తమలాగే అచ్చం ఒకేలా ఉండే కవల సోదరులనే ఈ ఐడెంటికల్ ట్విన్స్ పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరు కవల అబ్బాయిలు కూడా ముమ్మూర్తులా ఒకేలా ఉంటారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News