Sudeep: ఓటీటీ వైపు నుంచి రికార్డు క్రియేట్ చేసిన 'మ్యాక్స్' మూవీ!

- 'మ్యాక్స్'గా పలంకరించిన సుదీప్
- డిసెంబర్లో థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ నెల 15 నుంచి మొదలైన స్ట్రీమింగ్
- 4 రోజులలోనే కొత్త రికార్డ్ సెట్ చేసిన కంటెంట్
కన్నడలో కిచ్చా సుదీప్ కి మంచి ఇమేజ్ ఉంది. ఆయన యాక్టింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకు తగిన కథలనే ఆయన ఎంచుకుంటూ వెళుతుంటాడు. అలా ఆయన నుంచి వచ్చిన సినిమానే 'మ్యాక్స్'. పోయిన ఏడాది డిసెంబర్ 25వ తేదీన థియేటర్లు ఈ సినిమా వచ్చింది. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'జీ 5'వారు సొంతం చేసుకున్నారు. కన్నడతో పాటు, తెలుగు .. తమిళ .. మలయాళ భాషలలో ఈ నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో ఇలా అడుగుపెట్టిందో లేదో అలా ఈ సినిమా దూసుకుపోతోంది. 4 రోజులలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇంతవరకూ మలయాళ మూవీ 'మిసెస్' పేరుతో ఉన్న రికార్డును ఈ సినిమా సొంతం చేసుకుంది.
'మ్యాక్స్' ఓ పోలీస్ ఆఫీసర్. అతను కొత్తగా ఓ పోలీస్ స్టేషన్ లో ఛార్జ్ తీసుకుంటాడు. అదేరోజు రాత్రి, ఆ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుల వారసులు పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో మరణిస్తారు. పోలీసులంతా కలిసి అక్కడి నుంచి శవాలను మాయం చేయాలనుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? మ్యాక్స్ కి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అనేది కథ.