KTR: సిరిసిల్లలో టీ స్టాల్ మూసివేయించడంపై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

KTR responds on Tea stall closed in Sircilla

  • ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుంటానన్న కేటీఆర్
  • ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదని ట్వీట్
  • ఈ మాట మీదే ఉంటానని హామీ ఇస్తున్నానని వ్యాఖ్య

సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో తన పేరుతో పాటు ఫొటో పెట్టుకున్నందుకు ఒక టీ స్టాల్‌ను మూసివేయించారనే ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామారావు స్పందించారు. ఈ విషయంపై 'ఎక్స్' వేదికగా ఆయన స్పందిస్తూ, ప్రతి విషయాన్ని గుర్తు గుర్తుంచుకుంటున్నానని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో తన మాట మీద ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

సిరిసిల్లకు చెందిన టీ దుకాణం యజమాని బత్తుల శ్రీనివాస్ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేశారు. శ్రీనివాస్ నాలుగేళ్లుగా బతుకమ్మ ఘాట్ వద్ద 'కేటీఆర్ టీ స్టాల్' పేరుతో టీ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన హోటల్ బోర్డుపై కేటీఆర్ ఫొటోను కూడా ఉంచాడు. అయితే, ఇటీవల ఆ టీ దుకాణాన్ని మూసివేయించారు. కేటీఆర్ పేరు, ఫొటో పెట్టుకున్నందుకే తన దుకాణాన్ని మూసివేయించారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నాడు. అయితే, ట్రేడ్ లైసెన్స్ లేకపోవడం వల్లే దుకాణాన్ని మూసివేసినట్లు అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News