- చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయేషా ఖాన్
- గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన బ్యూటీ
- ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీ
- తెలుగులోను ఆమె జోరు కొనసాగాలనుకుంటున్న ఫ్యాన్స్
సాధారణంగా ఏ సినిమాలోనైనా .. ఎంతమంది అమ్మాయిలు తెరపై కనిపించినా .. వాళ్లలో హీరోయిన్ మాత్రమే అందంగా ఉంటుంది. అందువల్లనే ఆమె తెరపై కనిపిస్తున్నంత సేపు ఆడియన్స్ అలా కళ్లు అప్పగించి చూస్తుండిపోతారు. గ్లామర్ విషయానికి వచ్చేసరికి హీరోయిన్ గురించి తప్ప వాళ్లు మరెవరి గురించి ఆలోచన చేయరు. కానీ ఆ మధ్య ఒక అమ్మాయిని తెరపై చూడగానే అసలు హీరోయిన్ గురించి అంతా మరిచిపోయారు. అంతగా హీరోయిన్ ను మరిపించిన ఆ అమ్మాయిపేరే ఆయేషా ఖాన్.

'ముఖచిత్రం' సినిమాతో ఆయేషా ఖాన్ తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తరువాత 'ఓం భీమ్ బుష్' సినిమాలో 'రత్తాలు' పాత్రలో మెరిసింది. చేపలు అమ్మే ఈ పాత్రలో ఆమె గ్లామర్ చూసిన కుర్ర ప్రేక్షకులు ముందు జరిగిన కథ మరిచిపోయారు .. తరువాత జరుగుతున్న కథను పట్టించుకోవడం మానేశారు. అంతగా ఆమె తన ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకుంది. చేపల మాదిరిగా తళుక్కున మెరిసే ఆమె కనులకు అంత దాసోహమన్నారు.

ఆ సినిమా తరువాత కూడా ఆమె అందాల అల్లరి చాలామందిని చాలా కాలం పాటు వెంటాడుతూనే ఉంది. ఆయేషాది హీరోయిన్ గా చేయవలసిన గ్లామర్ అనీ, అసలు ఆమె బాలీవుడ్ మెటీరియల్ అనే అభిప్రాయాలు వినిపించాయి. ఐటమ్ సాంగ్స్ పరంగా కొంతకాలం పాటు ఆమె హవా కొనసాగడం ఖాయమనే టాక్ వినిపించింది. ప్రస్తుతం ఆమె మాత్రం బాలీవుడ్ సినిమాలపైనే దృష్టిపెడుతున్నట్టుగా తెలుస్తోంది. అలా ఊరించి ఇలా మాయమైన ఆయేషా ఖాన్ ను, మళ్లీ తెలుగు వైపుకు ఏ ప్రాజెక్టు పట్టుకొస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.