Chandrababu: మోదీ, అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు

- ప్రకృతి విపత్తులకు గురైన రాష్ట్రాలకు కేంద్రం సాయం
- నేడు నిధులు మంజూరు చేసిన కేంద్ర హై లెవల్ కమిటీ
- సోషల్ మీడియా వేదికగా స్పందించిన చంద్రబాబు
గతేడాది ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలమైన ఏపీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని హై లెవల్ కమిటీ రూ.608.08 కోట్లు మంజూరు చేయడం తెలిసిందే. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు.
ఏపీ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ప్రకృతి విపత్తు బాధిత రాష్ట్రాలకు ప్రకటించిన రూ.1554.99 కోట్లలో ఏపీకి రూ.608.08 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు అంటూ చంద్రబాబు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర హై లెవల్ కమిటీ ప్రకటనను కూడా పంచుకున్నారు.