KCR: ఏడు నెలల తర్వాత బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్

KCR in BRS bhavan after seven months

  • ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి నేరుగా తెలంగాణ భవన్ చేరుకున్న కేసీఆర్
  • నేటితో 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న పార్టీ
  • చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులతో చర్చించనున్న కేసీఆర్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు ఏడు నెలల విరామం తర్వాత హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి ఆయన నేరుగా తెలంగాణ భవన్ చేరుకున్నారు.

పార్టీని స్థాపించి 24 ఏళ్లు పూర్తైంది. ఈరోజుతో 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ ముఖ్య నాయకులతో చర్చించనున్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకలు, సభ్యత్వ నమోదు, భారీ బహిరంగ సభ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశనం చేయనున్నారు.

సీఎం సీఎం అంటూ నినాదాలు

కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకోగానే అక్కడకు చేరుకున్న పార్టీ శ్రేణులు 'సీఎం సీఎం' అంటూ నినాదాలు చేశారు. అరవొద్దంటూ ఆయన కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ను చూసేందుకు పెద్ద ఎత్తన అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

  • Loading...

More Telugu News