AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ వాయిదా... కారణం ఇదే!

- ఫిబ్రవరి 20న జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ
- అదే రోజున ఢిల్లీలో సీఎం ప్రమాణ స్వీకారం
- ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బీజేపీ
- ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగాల్సి ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ నెల 20న రాష్ట్ర కేబినెట్ భేటీ నిర్వహించాలని భావించారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు అదే రోజున ఢిల్లీ వెళుతున్నారు. రేపు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు కూడా ఉన్నారు.
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ హైకమాండ్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దాంతో చంద్రబాబు కూడా ఢిల్లీ వెళుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక కేబినెట్ భేటీ రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది.