Saritha: 'మరో చరిత్ర' హీరోయిన్ సరిత పుట్టిపెరిగింది ఇక్కడేనట!

- సరిత పుట్టిల్లు 'మోపర్రు' అని చెప్పిన సన్నిహితులు
- ఆమె మేనత్తవాళ్లు మునిపల్లెలో ఉండేవారని వెల్లడి
- ఇక్కడి నుంచే చెన్నై వెళ్లారని వివరణ
- ఈ ఊరికి రహస్యంగా వచ్చి వెళుతూ ఉండేవారని వ్యాఖ్య
1980లలో కథానాయికగా సరిత దూసుకుపోయింది. 'మరో చరిత్ర' సినిమాతో ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు .. తమిళ భాషల్లో ఆమెకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి సరిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఆమె అభిమానులకు ఉండటం సహజం. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ వారు ఆమె గురించిన కొన్ని వివరాలను సేకరించడం కోసం గుంటూరు జిల్లా 'మునిపల్లె'కు వెళ్లారు. అక్కడి చుట్టుపక్కలవారి ద్వారా వాకబు చేశారు.
" సరిత .. 'మోపర్రు' గ్రామంలో జన్మించారు. అయితే ఆమె చాలా ఇంటర్వ్యూలలో తన గ్రామం గుంటూరు జిల్లా 'మునిపల్లె' అనే చెప్పారు. బహుశా ఈ ఊరుతో చిన్నప్పటి నుంచి ఆమెకి మంచి అనుబంధం ఉండటం వలన అలా చెప్పి ఉండవచ్చునేమో. ఇక్కడ సరిత మేనత్త వెంటక నరసమ్మ ఉండేవారు. ఆమె సరిత తండ్రి చక్రవర్తికి స్వయాన చెల్లెలు. అప్పట్లోనే మంచి ఆస్తిపరులు" అని చుట్టుపక్కలవారు అన్నారు.
"మాకు తెలిసి సరితను మేము ఎప్పుడూ 'మునిపల్లె'లో చూడలేదు. అయితే ఆమె తండ్రి ఆమెను కార్లో తీసుకుని వచ్చి .. వెంటనే తీసుకుని వెళ్లిపోయేవారని అంటూ ఉంటారు. 'అఖండ'లో బాలకృష్ణ తల్లి పాత్రను పోషించిన వీజీ చంద్రశేఖర్ .. సరితకు స్వయన చెల్లెలు. ఆమె మాత్రం మేనత్త ఇంట్లో కనిపించేవారు. సరిత తండ్రి చనిపోయి చాలాకాలమే అవుతోంది. ఆమె తల్లి మాత్రం విజయవాడలో ఉంటున్నారు" అని చెప్పారు.