KCR: నేడు బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం.. హాజరవుతున్న కేసీఆర్

- ఈ ఏడాది 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న బీఆర్ఎస్
- తెలంగాణ భవన్ లో ఈరోజు విస్తృతస్థాయి సమావేశం
- పార్టీ నిర్మాణం, సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్న నేతలు
చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాహ్యప్రపంచంలోకి వస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేసీఆర్ హాజరవుతుండడంతో దీనిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించింది. ఈ ఏడాది 25వ వసంతంలోకి ప్రవేశించబోతోంది. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ భవన్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ లు, జిల్లా అధ్యక్షులు, ఇతర విభాగాల అధ్యక్షులు హాజరవుతున్నారు. ఈ సమావేశం గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ... పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు.