Mohammed Siraj: ఆశా భోంస్లే మనవరాలితో డ్యూయెట్ పాడిన సిరాజ్.. వైరల్‌గా మారిన వీడియో!

స్టార్ పేసర్, హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ కు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న అతడు.. ఆ సమయాన్ని జాలీగా గడుపుతున్నాడు. తాజాగా లెజెండరీ గాయని ఆశా భోంస్లే మనవరాలు జనాయ్‌తో కలిసి డ్యూయెట్ సాంగ్ పాడాడు.
అందుకు సంబంధించిన వీడియోను సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. జనాయ్ తో కలిసి సిరాజ్ గొంతు సవరించడం వీడియోలో ఉంది. ఆమె కొత్త మ్యూజిక్ ఆల్బమ్ లోని 'కెహందీ హై' పాటలోని కొన్ని పంక్తులను ఇద్దరూ కలిసి పాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
కాగా, ఇటీవల జనాయ్, సిరాజ్ మధ్య ప్రేమాయణం సాగుతోందని పుకార్లు వచ్చాయి. అయితే, ఈ పుకార్లను చెక్ పెడుతూ జనాయ్ తమ మధ్య అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఉందని స్పష్టం చేశారు. సిరాజ్‌ను 'మేరే ప్యారే భాయ్ (నా ప్రియమైన సోదరుడు)' అని పిలిచారు. ఈ మేరకు జనాయ్ తన ఇన్‌స్టా స్టోరీలో సిరాజ్‌ను గుర్తు చేసుకుంటూ తన పోస్ట్‌ను షేర్ చేశారు. అటు పేసర్ కూడా ఆమెను 'బెహ్నా' (సోదరి) అని పిలవడంతో ఈ పుకార్లకు పుల్‌స్టాప్ పడింది.