Off Beat: మొదటి భార్య వద్ద మూడు రోజులు.. రెండో భార్య వద్ద మూడు రోజులు.. ఆ ఒక్క రోజు అతడిష్టం!

Bigamy Dispute Settled In Bihars Purnia with bond

  • పోలీస్ స్టేషన్‌లో బాండ్ రాసిచ్చిన భర్త 
  • విస్తుపోయిన పోలీస్ కౌన్సెలర్లు
  • సంతోషంగా అంగీకరించి సంతకం చేసిన భార్యలు

మొదటి భార్య వద్ద మూడు రోజులు, రెండో భార్య వద్ద మూడు రోజులు ఉంటానని, మిగిలిన ఒక్క రోజు తనకు సెలవని, ఆ రోజు మాత్రం తనకు నచ్చిన చోట ఉంటానంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఓ బాండ్ రాసిచ్చాడు. బీహార్‌లోని పూర్ణియా జిల్లా రూపౌలి పోలీస్ స్టేషన్‌లో జరిగిందీ ఘటన. 

పోలీసుల కథనం ప్రకారం.. శంకర్‌ షాకు 2000వ సంవత్సరంలో పూనమ్‌తో వివాహమైంది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఏడేళ్ల క్రితం వీరి మధ్య మనస్పర్థలు పొడసూపాయి. ఈ క్రమంలో ఉషాదేవి అనే మహిళను శంకర్ రహస్యంగా వివాహం చేసుకుని ఆమెతోనే ఉంటున్నాడు. విషయం మొదటి భార్య పూనమ్‌కు తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్పీ కార్తికేయ శర్మ ఆదేశాలతో జిల్లా పోలీసుల ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ శంకర్, పూనమ్, ఉషాదేవిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చింది. 

అనంతరం శంకర్ ఓ విచిత్రమైన బాండ్‌ను రాసి పోలీసులకు ఇచ్చాడు. వారంలో మొదటి మూడు రోజులు మొదటి భార్యతోను, మరో మూడు రోజులు రెండో భార్యతోను ఉంటానని, మిగిలిన ఒక్క రోజు మాత్రం తనకు సెలవని, ఆ రోజు మాత్రం తనకు నచ్చిన వారితో ఉంటానని అందులో పేర్కొన్నాడు. అది చూసి పోలీసులు విస్తుపోయారు. అలాగే, మొదటి భార్య ఇద్దరు పిల్లల పోషణ నిమిత్తం ప్రతినెల రూ. 4 వేల చొప్పున చెల్లిస్తానని పేర్కొన్నాడు. ఈ ఒప్పందానికి ఆయన భార్యలిద్దరూ సంతోషంగా అంగీకరిస్తూ బాండ్‌పై సంతకాలు చేయడంతో సమస్య పరిష్కారమైంది.

  • Loading...

More Telugu News