: బీసీసీఐ బాధ్యతారాహిత్యం: కుంద్రా న్యాయవాది
రాజస్తాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రాపై బీసీసీఐ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిందని కుంద్రా న్యాయవాది మజీద్ మీనన్ ఆరోపించారు. స్పాట్ ఫిక్సింగ్ పై దర్యాప్తు పూర్తయ్యే వరకూ క్రికెట్ వ్యవహారాల్లో పాల్గొనకుండా రాజ్ కుంద్రాను సస్పెండ్ చేస్తూ ఢిల్లీలో జరిగిన అత్యవసర సమావేశంలో బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 'రాజ్ కుంద్రాను విచారించి తగు నిర్ణయం తీసుకుంటారని అనుకున్నాం. కానీ బీసీసీఐ కుంద్రాతో ఏమాత్రం మాట్లాడకుండా, అతని అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా సస్పెన్షన్ వేటు వేసింది. ఇది పూర్తిగా ఏకపక్ష నిర్ణయం' అంటూ బీసీసీఐపై మీనన్ మండిపడ్డారు.