KTR: 'ముఖ్యమంత్రి కేటీఆర్' అంటూ నోరుజారిన మంత్రి జూపల్లి, కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

Minister Jupalli is going to be sacked from cabinet soon for this mistake

  • మీడియా సమావేశంలో నోరు జారిన మంత్రి జూపల్లి కృష్ణారావు
  • జూపల్లిని మంత్రివర్గం నుండి తొలగిస్తారేమోనని కేటీఆర్ చురక
  • నేను చెప్పే మాటలు గుర్తుంచుకోండంటూ ట్వీట్

'ముఖ్యమంత్రి కేటీఆర్' అంటూ తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు నోరు జారారు. ఆ తర్వాత 'ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి' అంటూ సరిదిద్దుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి పేరును మరిచిపోయారని, ఈ పొరపాటుకు గాను ఆయనను త్వరలో మంత్రివర్గం నుంచి తొలగించినా ఆశ్చర్యం లేదని కేటీఆర్ 'ఎక్స్' వేదికగా రాసుకొచ్చారు. నేను చెప్పిన ఈ మాటలను గుర్తుంచుకోండంటూ ట్వీట్ చేశారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, "నెలకు రూ.6,500 కోట్లను ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు" అంటూ తడబడి, ఆ తర్వాత సర్దుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేస్తూ, జూపల్లిని మంత్రివర్గం నుండి తొలగిస్తారేమోనని చురక అంటించారు.

More Telugu News