Tirumala Laddu Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితులకు ముగిసిన సిట్ విచారణ

- తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసు
- నలుగురు నిందితులను ఐదు రోజుల పాటు విచారించిన సిట్
- నిందితులకు తిరుపతి రుయా ఆసుపత్రి లోవైద్య పరీక్షలు
తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులకు సిట్ విచారణ నేటితో ముగిసింది. తిరుపతిలో సిట్ కార్యాయంలో ఐదు రోజుల పాటు ఈ విచారణ సాగింది. సిట్ అధికారులు కస్టడీలో వివిధ అంశాలపై సమాచారం రాబట్టారు.
భోలే బాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, శ్రీ వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ లను సిట్ ప్రశ్నించింది. నలుగురు నిందితులకు తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కస్టడీ ముగిసిన అనంతరం నిందితులను పోలీసులు తిరుపతి రెండో అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.