Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం, సింఘానియా గ్రూప్ మధ్య ఒప్పందం

- తిరుపతి జిల్లాలోని 14 స్కూళ్లలో మార్పులు తీసుకురావాలని నిర్ణయం
- క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరణ
- ఏపీ విద్యారంగాన్ని దేశంలో నెంబర్ వన్ చేయడమే లక్ష్యమన్న నారా లోకేశ్
విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, సులోచనా దేవి సింఘానియా స్కూల్ ట్రస్ట్ మధ్య ఒప్పందం జరిగింది. తిరుపతి జిల్లాల్లోని 14 పాఠశాలల్లో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు.
బోధనలో నాణ్యత, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ, విద్యా నైపుణ్యాల శిక్షణ అందించనున్నారు. ఐదేళ్లలో లక్ష మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని నిర్ణయించారు. అనంతరం అమరావతి, విశాఖ, కాకినాడకు కూడా సింఘానియా ట్రస్ట్ సేవలు విస్తరించనున్నారు.
ఒప్పందం సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... ఏపీ విద్యారంగాన్ని దేశంలో నెంబర్ వన్ చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. కేజీ టు పీజీ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు. కాలేజి విద్య పూర్తవగానే ఉద్యోగం వచ్చేలా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునేలా శిక్షణ ఇస్తామని వెల్లడించారు.