Harish Rao: చరిత్ర సృష్టించి నేటికి పదకొండేళ్లు: హరీశ్ రావు

- స్వరాష్ట్ర సాధనకు తెలంగాణ ఉవ్వెత్తున ఉద్యమించిందన్న హరీశ్ రావు
- 2014 ఫిబ్రవరి 18న బిల్లుకు ఆమోదం లభించిందని గుర్తు చేసుకున్న హరీశ్ రావు
- కేసీఆర్ కృషి, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు అన్న హరీశ్ రావు
చరిత్ర సృష్టించి 11 ఏళ్లు అయిందని, సరిగ్గా 2014 ఫిబ్రవరి 18వ తేదీన లోక్ సభలో తెలంగాణ బిల్లుకు (ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు) ఆమోదం లభించిందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉవ్వెత్తున ఉద్యమించిందని, 2014లో ఇదే రోజున నవచరిత్రకు పునాది పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.
కేసీఆర్ కృషి, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఫలించింది ఈరోజే (2014 ఫిబ్రవరి 18) అన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని ప్రజా ఉద్యమం కారణంగా పదకొండేళ్ల క్రితం లోక్ సభలో తెలంగాణ బిల్లు పాసైందని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు బిల్లు పాసైన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన సంబరాలకు సంబంధించిన ఫొటోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.