Jagan: వల్లభనేని వంశీని కలిసిన జగన్.. జైలు వద్ద భారీ బందోబస్తు

- బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న జగన్
- ములాఖత్ లో వంశీని కలిసిన జగన్
- జైలు పరిసరాల్లో 144 సెక్షన్
కిడ్నాప్ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆ పార్టీ అధినేత జగన్ కలిశారు. కాసేపటి క్రితం బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న జగన్.... విమానాశ్రయం నుంచి నేరుగా జైలుకు వెళ్లారు. ములాఖత్ ద్వారా వంశీని కలిసి, పరామర్శించారు. జైలు వద్ద వంశీ భార్య పంకజశ్రీ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా జైలు వద్ద పోలీసులు భారీ బందోస్తును ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జైలుకు కొంత దూరంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి, జైలు వద్దకు ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. మీడియాను, కొందరు నేతలను మాత్రమే జైలు వరకు అనుమతించారు. ములాఖత్ అనంతరం మీడియాతో జగన్ మాట్లాడే అవకాశం ఉంది.