KTR: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మ‌రోసారి ఘాటు వ్యాఖ్య‌లు

BRS Working President KTR Criticizes CM Revanth Reddy

     


ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి ఘాటు వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఒక పోస్టు చేశారు. "పచ్చకామెర్లు వ‌చ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. మీరు బ్యాగులతో దొరికారని... అందరూ మీ లాగానే బ్లాక్మెయిల్ దందాలు చేస్తారని సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ బ్రతుకుతున్నారని అనుకోవడం తప్పు. 

ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు మన దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముకలు. సివిల్ సర్వెంట్ల నినాదం 'ఎక్సలెన్స్ ఇన్ యాక్షన్'.  'ఏసీ అండ్‌ ఇనాక్షన్' కాదు. వారి గురించి సీఎం రేవంత్ మాట్లాడిన మాట‌లు కించ‌ప‌రిచేలా, అమర్యాదకరంగా ఉన్నాయి. బ్యూరోక్రాటిక్ వ్య‌వ‌స్థ ప్ర‌తిష్ట‌ను నాశ‌నం చేసేందుకు ముఖ్య‌మంత్రి నిరంత‌రం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను  తీవ్రంగా ఖండిస్తున్నా" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.  

More Telugu News