KTR: ఉప ఎన్నికలు ఖాయం.. సిద్ధంగా ఉండండి: కేటీఆర్

KTR confident of bypolls

  • పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
  • సుప్రీంకోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
  • ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని కేటీఆర్ ధీమా

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారని ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ ను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నెల 10వ తేదీన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈమేరకు ప్రశ్నించింది. స్పీకర్ సమయం నిర్దేశించకుంటే... తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని చెప్పారు. ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ కేడర్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

KTR
BRS
Defected MLAs
Supreme Court
  • Loading...

More Telugu News