Phonepe: యూజర్ల కోసం కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకువచ్చిన ఫోన్ పే

phonepe launches device tokenization solution features

  • సురక్షితమైన కార్డు లావాదేవీల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్
  • ఫోన్ పే కొత్త ఫీచర్
  • క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం తీసుకొచ్చిన ఫీచర్ 

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్స్‌ను ప్రారంభించింది. ఫోన్‌పే వినియోగదారులు యాప్‌లో తమ కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు, ప్రయాణ టికెట్ల బుకింగ్, బీమా కొనుగోలు, పిన్ కోడ్ ఆధారిత చెల్లింపులు సులభంగా చేసుకోవచ్చు.

ఫోన్‌పే వినియోగదారులు తమ కార్డులను టోకనైజ్ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇకపై ప్రతి లావాదేవీకి తమ కార్డు వివరాలను మర్చంట్ వేదికలపై భద్రపరచాల్సిన అవసరం ఉండదు. అలాగే, సీవీవీ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం కూడా లేదని ఫోన్‌పే తెలిపింది. టోకనైజ్డ్ కార్డులను ఫోన్‌కు సురక్షితంగా అనుసంధానించడం వల్ల మోసాల బారిన పడకుండా ఉండవచ్చు. దీనివల్ల వినియోగదారులకు ఆన్‌లైన్ చెల్లింపులపై భరోసా పెరుగుతుంది.

ప్రారంభంలో వినియోగదారులు వీసా క్రెడిట్, డెబిట్ కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చని ఫోన్‌పే తెలిపింది. ఫోన్‌పే చెల్లింపు గేట్‌వే సేవలు అనుసంధానమైన ఆన్‌లైన్ వ్యాపారుల వద్ద కూడా కార్డును టోకనైజ్ చేసుకోవచ్చు. 

Phonepe
Device Tokenization
Business News
  • Loading...

More Telugu News