Gold: జనవరి నెలలో బంగారం దిగుమతి వివరాలు ఇవిగో!

gold imports Up 40 pc in jan

  • జనవరి నెలలో 2.68 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి
  • గత ఏడాదితో పోలిస్తే ఈ మొత్తం 40.9 శాతం అధికమన్న వాణిజ్య మంత్రిత్వ శాఖ
  • కొత్త సంవత్సరం పసిడి ధర 11 శాతం మేర పెరుగుదల

పసిడి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. వినియోగదారులు ఆసక్తి చూపుతుండటంతో అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. జనవరి నెలలో నమోదైన బంగారం దిగుమతులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఒక్క జనవరి నెలలోనే 2.68 బిలియన్ డాలర్ల (సుమారు రూ.23 వేల కోట్లు) విలువైన బంగారాన్ని మన దేశం దిగుమతి చేసుకుంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ మొత్తం 40.9 శాతం అధికమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఏడాది జనవరిలో దిగుమతుల విలువ 1.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జనవరి వరకు దేశంలోకి 50 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ దిగుమతుల విలువ 37.85 బిలియన్ డాలర్లుగా ఉంది.

కాగా, నూతన సంవత్సరంలో పసిడి ధర దాదాపు 11 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ.88,200కు చేరింది. 

  • Loading...

More Telugu News