Delta Airlines: ల్యాండ్ అవుతూ తిరగబడిన విమానం.. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు.. వీడియో ఇదిగో!

Plane flips on landing at airport in Canada

  • కెనడాలోని టొరొంటో పియర్స్ విమానాశ్రయంలో ఘటన
  • క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమం
  • బలమైన గాలులే ప్రమాదానికి కారణమని అనుమానం

విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో తిరగబడటంతో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులున్నారు. డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం కెనడాలోని టొరొంటో పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బలమైన గాలులే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. 

గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఒక చిన్నారి కూడా వుంది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. విమానం మిన్నియాపొలిస్ నుంచి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి చాలామంది ఎలాంటి గాయాలు లేకుండా బయటపడినట్టు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. తిరగబడిన విమానం నుంచి ప్రయాణికులను రక్షిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More Telugu News