Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో విజేత ఎవరో చెప్పిన ఆసీస్ లెజెండ్

- ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
- పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా హైబ్రిడ్ మోడల్ లో టోర్నీ నిర్వహణ
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మైకేల్ క్లార్క్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. హైబ్రిడ్ మోడల్ లో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా వన్డే ఫార్మాట్ లో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 8 అగ్రశ్రేణి జట్లు తలపడుతున్న ఈ టోర్నీలో విజేత ఎవరన్నది ఆస్ట్రేలియా లెజెండ్ మైకేల్ క్లార్క్ జోస్యం చెప్పాడు.
ఈ మెగా టోర్నీలో భారత జట్టు ఛాంపియన్ గా నిలుస్తుందని అన్నాడు. రోహిత్ శర్మ ఫామ్ ను దొరకబుచ్చుకోవడం భారత జట్టుకు శుభసూచకం అని, అదే ఊపులో ఆ జట్టు టోర్నీలో విజేతగా నిలుస్తుందని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ఇక, ఈవెంట్ లో రోహిత్ శర్మ అందరికంటే ఎక్కువ పరుగులు నమోదు చేస్తాడని, ఒక్కసారి అతడు క్రీజులో పాతుకుపోయాడంటే అతడ్ని ఆపడం ఎవరితరం కాదని పేర్కొన్నాడు.
బౌలింగ్ లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలుస్తాడని క్లార్క్ పేర్కొన్నాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలుస్తాడని వ్యాఖ్యానించాడు.