Chilukuru Balaji Temple: చిలుకూరు ఆలయం అర్చకుడు రంగరాజన్‌పై దాడి నిందితుడికి పోలీసు కస్టడీ

Court accepts custody of Veera Raghava Reddy for three days

  • వీరరాఘవ రెడ్డిని మూడ్రోజుల పోలీసు కస్టడీకి అనుమతించిన కోర్టు
  • రేపటి నుండి కస్టడీకి తీసుకోనున్న పోలీసులు
  • రంగరాజన్‌పై దాడి చేసిన ఘటనలో వీరరాఘవ రెడ్డి అరెస్ట్

చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి కస్టడీకి కోర్టు అనుమతించింది. వీరరాఘవరెడ్డిని మూడ్రోజుల కస్టడీకి అనుమతించింది. నిందితుడిని ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని రాజేంద్ర నగర్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. పోలీసులు రేపటి నుండి మూడు రోజుల పాటు అతనిని కస్టడీకి తీసుకోనున్నారు.

ఇటీవల, చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు రంగరాజన్‌పై వీరరాఘవరెడ్డి దాడి చేసినట్లు వార్తలు రావడం తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపింది. రంగరాజన్‌పై దాడిని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. రంగరాజన్‌ను పలువురు రాజకీయ నాయకులు, వివిధ సంఘాల నేతలు కలిసి సంఘీభావం తెలిపారు.

  • Loading...

More Telugu News