Madhu Yaskhi: ఎల్బీ నగర్ డీసీపీపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ తీవ్ర ఆగ్రహం

- డీసీపీ తీరును ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానన్న మధుయాష్కీ
- డీసీపీ శాంతిభద్రతలపై పార్ట్ టైమ్‌గా పని చేస్తున్నారని ఎద్దేవా
- డీసీపీ ఇప్పటికైనా తీరు మార్చుకుంటే మంచిదని హితవు
హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ డీసీపీ వ్యవహారశైలిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని ఆయన తెలిపారు. ఎల్బీనగర్ డీసీపీ పూర్తి సమయం ల్యాండ్ సెటిల్మెంట్లలో నిమగ్నమయ్యారని విమర్శించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం మాత్రం పార్ట్ టైమ్‌గా పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎల్బీనగర్ డీసీపీ ఇప్పటికైనా తన ప్రవర్తనను మార్చుకోవాలని మధుయాష్కీ సూచించారు. ఒకవేళ డీసీపీ తన తీరును మార్చుకోకపోతే ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు. మధుయాష్కీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే.