: మూడు బ్యాంకులకు ఆర్బీఐ బ్యాండు
ఒక్కోసారి అంతే... ఎంతవారలైన విధివంచితులే అన్నట్టు బ్యాంకులకు బ్యాండు పడుతుంది. చిన్న తప్పు జరిగితే ఖాతాదారులను ఫైన్ తో మోతమోగించే బ్యాంకులకు తాజాగా ఆర్బీఐ వాతపెట్టింది. ఖాతాదారుల నియమావళి ఉల్లంఘించినందుకు మూడు బ్యాంకులపై కొరడా ఝుళిపించింది. యాక్సిస్ బ్యాంకు కు 5 కోట్లు, హెచ్ డీఎఫ్ సీ కి 4.5 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకుకు కోటి రూపాయాల చొప్పున జరిమానా విధించింది. ఈ మూడు బ్యాంకులు మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డాయన్న కోబ్రా పోస్టు కధనానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆర్ బీఐ అభిప్రాయపడింది.