: బ్రదర్ అనిల్ పై గుప్పుమన్న భూకబ్జా ఆరోపణలు


దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అల్లుడు, క్రైస్తవ మత ప్రభోధకుడు బ్రదర్ అనిల్ మరోసారి వార్తలకెక్కారు. పలు కంపెనీల్లో అక్రమ పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ మళ్లీ చిక్కుల్లో పడ్డట్టు కనిపిస్తోంది. మణికొండలో తమకు చెందిన ఐదు ఎకరాల భూమిని ఆక్రమించుకున్న అనిల్, అక్కడ చర్చి నిర్మిస్తున్నారని యాదయ్య అనే వ్యక్తి వాపోయాడు.

తమ ఐదు ఎకరాల భూమిని తమకు అప్పగించాలంటూ యాదయ్య కుటుంబ సభ్యులు అధికారులను కోరారు. అన్యాయంగా భూకబ్జాకు పాల్పడడమే కాకుండా, తమపై దాడులు కూడా చేస్తున్నారని వారు వెల్లడించారు. కాగా, బాధితులకు తెలంగాణ క్రైస్తవ సంఘం, రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంఘం తమ మద్దతు ప్రకటించాయి.

  • Loading...

More Telugu News