KCR: వివాహ వేడుకలో పూలదండలు, ఉంగరాలు మార్చుకున్న కేసీఆర్ దంపతులు

- గజ్వేల్‌లో వివాహ వేడుకకు హాజరైన కేసీఆర్, శోభ
- వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ అధినేత దంపతులు
- పూలదండలు, ఉంగరాలు తెచ్చి మార్చుకోమని కేసీఆర్ దంపతులను కోరిన పెళ్లివారు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు ఓ వివాహ వేడుకలో ఒకరికొకరు పూలదండలు మార్చుకుని, ఉంగరాలు తొడుక్కున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన నమస్తే తెలంగాణ సంపాదకులు తిగుళ్ల కృష్ణమూర్తి కుమారుడి వివాహ విందుకు కేసీఆర్, శోభ దంపతులు హాజరయ్యారు. ఈ వేడుకకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వధూవరులను ఆశీర్వదించారు.
ఈ రోజే కేసీఆర్ జన్మదినం కావడంతో పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, వివాహ వేడుక నిర్వాహకులు వేదిక మీదకు పూలదండలు, ఉంగరాలు తీసుకువచ్చారు. కేసీఆర్, శోభ దంపతులను దండలు, ఉంగరాలు మార్చుకోవాలని కోరారు. దీంతో కేసీఆర్, శోభ దంపతులు ఒకరికొకరు దండలు మార్చుకొని, ఉంగరాలు తొడుక్కున్నారు.