Union Budget 2025-26: ఏపీలో 9 రోజుల పాటు కేంద్ర బడ్జెట్ పై మేధావుల చర్చలు

- ఇటీవల వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం
- రేపటి నుంచి ఏపీలో మేధావుల చర్చలు
- పలు నగరాల్లో సమావేశాలకు హాజరుకానున్న కేంద్రమంత్రులు, ఎంపీలు
ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.50.65 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీలో 9 రోజుల పాటు కేంద్ర బడ్జెట్ పై మేధావులతో చర్చలు ఏర్పాటు చేశారు. ఈ చర్చలకు కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు.
రేపు (ఫిబ్రవరి 18) గుంటూరులో జరిగే చర్చకు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 19న తిరుపతిలో జరిగే సమావేశానికి కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరవుతారు. ఈ నెల 21న విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశానికి కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి హాజరు కానున్నారు.
ఈ నెల 22న విశాఖలో జరిగే సమావేశానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హాజరవుతారు. అదే రోజున రాజమండ్రిలో జరిగే సమావేశానికి బీజేపీ ఎంపీ పురందేశ్వరి... కాకినాడలో జరిగే సమావేశానికి మరో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ హాజరుకానున్నారు. ఇతర సమావేశాల వివరాలు తెలియాల్సి ఉన్నాయి.