Bandi Sanjay: బండి సంజయ్‌కి మహేశ్ కుమార్ గౌడ్ సవాల్

Mahesh Kumar Goud challenges Bandi Sanjay

  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బిల్లును తెస్తామన్న టీపీసీసీ చీఫ్
  • బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్‌లో పెట్టే దమ్ము ఉందా? అని ప్రశ్న
  • దేశవ్యాప్త కులగణనకు మోదీని అడిగే సత్తా ఉందా? అని నిలదీత

బీసీ నేతను ముఖ్యమంత్రిని చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లును తీసుకువస్తామని అన్నారు. ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్‌లో పెట్టించే దమ్ము ఉందా? అని నిలదీశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించే దమ్ముందా? అని బండి సంజయ్‌కి సవాల్ విసిరారు. దేశవ్యాప్త కులగణనకు మోదీని అడిగే సత్తా ఉందా? అని ప్రశ్నించారు. దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా భవిష్యత్తు అంతా బీసీలదే అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తాము అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తాయా? అని నిలదీశారు. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు.

  • Loading...

More Telugu News