Nara Brahmani: మహా కుంభమేళాలో పాల్గొనడం జీవితకాలపు అనుభూతి: నారా బ్రాహ్మణి

Nara Brahmani opines on her experience attending to Maha Kumbhmela

  • ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా-2025
  • కుటుంబంతో సహా పాల్గొన్న ఏపీ మంత్రి నారా లోకేశ్
  • ఫొటోలను పంచుకున్న నారా బ్రాహ్మణి

ఏపీ డిప్యూటీ సీఎం నారా లోకేశ్, ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మణి, తనయుడు నారా దేవాన్ష్ నేడు ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు. త్రివేణి సంగమం వద్ద షాహి స్నానఘట్టంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. సంప్రదాయబద్ధంగా గంగాదేవికి పూజలు చేసి, హారతి ఇచ్చారు. దీనిపై నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

మహా కుంభమేళా-2025లో పాల్గొనడం జీవితకాలపు అనుభూతి అని అభివర్ణించారు. ప్రయాగరాజ్ లో పవిత్ర స్నానం ఆచరించామని వెల్లడించారు. 

ఈ మహిమాన్విత గడ్డపైకి తరలివచ్చిన కోట్లాది మంది సామూహిక విశ్వాసాల నుంచి తాను అద్భుతమైన దివ్య శక్తిని అనుభూతి చెందానని నారా బ్రాహ్మణి వివరించారు. ఈ మేరకు తమ కుంభమేళా పర్యటన ఫొటోలను కూడా ఆమె పంచుకున్నారు.

  • Loading...

More Telugu News