Gannavaram TDP Office Attack: పోలీసుల ఎదుట లొంగిపోయిన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి నిందితులు

- 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి
- 88 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు
- తాజాగా జానీ, కలామ్ అనే ఇద్దరు నిందితుల లొంగుబాటు
- ఈ కేసులో ఏ71గా ఉన్న వల్లభనేని వంశీ ఇటీవలే అరెస్ట్
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో ఇద్దరు నిందితులు లొంగిపోయారు. టీడీపీ ఆఫీసుపైదాడికేసులో మొత్తం 88 మంది నిందితులు ఉండగా, వారిలో జానీ, కలామ్ అనే వ్యక్తులు ఇవాళ గన్నవరం పోలీసులు ఎదుట లొంగిపోయారు.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన 2023లో జరిగింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా... ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాక కేసును రీఓపెన్ చేశారు.
ఈ కేసులో ఏ71గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కొన్ని రోజుల కిందటే పోలీసులు కిడ్నాప్ వ్యవహారంలో అరెస్ట్ చేయడం తెలిసిందే.